మైథిలి ఠాకూర్.. జానపద గాయని. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయ ప్రవేశం చేశారు. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అప్పటి నుంచి బీహార్‌తో అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇక మైథిలి ఠాకూర్‌కు సొంత ప్రాంతంలో కాకుండా అలీనగర్ సీటును బీజేపీ కేటాయించింది.
అలీనగర్ చరిత్ర..
డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల తర్వాత 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడింది. అలీనగర్.. బీహార్‌లోని దర్భాంగా జిల్లాలోని జనరల్ కేటగిరీ అసెంబ్లీ నియోజకవర్గం. ఇందులో అలీనగర్, తర్దిహ్, ఘనశ్యాంపూర్, మోతీపూర్ పంచాయతీలు ఉన్నాయి. ఇక నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2010లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ వరుసగా రెండు సార్లు ఆర్జేడీ జయకేతనం ఎగరవేసింది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా బ్రాహ్మణులు, ముస్లింలు, యాదవ్‌లు ఎక్కువగా ఉంటారు. అయితే మైథిలి ఠాకూర్ బ్రాహ్మణ కావడంతో అలీనగర్ స్థానాన్ని బీజేపీ కేటాయించింది.
ఇది కూడా చదవండి: Bihar Elections: కొనసాగుతున్న ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!
ఇప్పటి వరకు అలీనగర్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. 2010, 2015లో ఆర్జేడీ నేత అబ్దుల్ బారి సిద్ధిఖీ విజయం సాధించగా.. 2020లో మాత్రం ఎన్డీఏలో భాగమైన వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి చెందిన మిశ్రీ లాల్ యాదవ్ గెలుపొందారు. ఆర్జేడీకి చెందిన బినోద్ మిశ్రాను 3,101 ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర మార్చారు. ఇప్పుడు ఇదే స్థానాన్ని మైథిలి ఠాకూర్‌కు కేటాయించారు. ఆర్జేడీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో సింగర్ రాణించగలదా? లేదా? అన్నది ఉత్కంఠ నెలకొంది. ఓటర్లను ఎంత మేరకు తన వైపు తిప్పుకున్నారన్నది నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: PM Modi: జంగిల్ రాజ్ పాలనలో అభివృద్ధి శూన్యం.. మళ్లీ ఆ రోజులు కోరుకోవద్దన్న మోడీ
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడతగా గురువారం 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో భాగంగా మంగళవారం 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.
