Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ని నిన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టారు. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంలో కుల్విందర్ కౌర్‌ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. గురువారం ఎయిర్‌పోర్టులో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు వెళ్తున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల హతం
2020లో రైతు చట్టాలపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతోనే తాను ఈ దాడికి పాల్పడినట్లు కుల్విందర్ కౌర్ చెబుతున్న ఓ వీడియో వైరల్ అయింది. ఈ దాడిపై కంగనా మాట్లాడుతూ, పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఆందోళనగా ఉందని అన్నారు. రైతుల ఉద్యమానికి వచ్చే వారు రూ.100 తీసుకుని వస్తున్నారని కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేసిన రోజు, తన తల్లి కూడా ఆందోళనల్లో పాల్గొందని కుల్విందర్ అన్నారు.
అయితే, ఈ వ్యవహారంపై కుల్విందర్ ట్వీట్ చేశారు. తన తల్లి గౌరవం కోసం 1000 ఉద్యోగాలు వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. మరోవైపు రైతు సంఘాలు కుల్విందర్‌కి మద్దతు ప్రకటించాయి. ఈ నెల 9న న్యాయ్ ర్యాలీ చేపట్టనున్నట్లు రైతు నేతలు చెప్పారు. విమానాశ్రయంలో ఈ ఘటనకు దారి తీసిన సంఘటనల క్రమంపై సరైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారుల్ని రైతు సంఘాలు కోరుతున్నాయి.
मुझे नौकरी की फिक्र नहीं है,
मां की इज्जत पर ऐसी हजारों नौकरियां कुर्बान है- कुलविंदर कौर— Kulvinder Kaur (@Kul_winderKaur) June 7, 2024