Site icon NTV Telugu

West Bengal: ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య.. ఉప ఎన్నికల్లో మమతా సర్కార్కు షాక్ తగిలే ఛాన్స్..!

Bengal

Bengal

West Bengal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. నవంబర్‌ 13న 6 అసెంబ్లీ సిట్టింగ్‌ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల ఓటమి ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు ఆర్‌జీ కార్‌ ఘటనే కారణమని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు

ఇక, పశ్చిమ బెంగాల్‌లో సీతాయ్, మదియాహత్, నైహతి, మేదినీపూర్, హరోవా, తల్దాంగ్రా సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్థానాల్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నియోజక వర్గాల ప్రజలు ఆర్‌జీ కార్‌ ఘటనలో జూనియర్‌ వైద్యురాలికి సపోర్టుగా నిలిచారు. ఇదే కేసులో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ అంశం దీదీ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
బెంగాల్‌లో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఆర్‌జీ కార్‌ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయింది. ఆరు సిట్టింగ్‌ స్థానాల్లో ఒకటి బీజేపీ, మిగిలిన ఐదు స్థానాలు టీఎంసీవి కాగా.. ఇప్పుడు ఈ మొత్తం స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని యత్నిస్తుంది. ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది.

Read Also: Zelensky: రష్యా లో నార్త్ కొరియా ఆర్మీ ఎంట్రీ.. చైనా మౌనంగా ఉండొద్దని జెలెన్ స్కీ వినతి

అయితే, ఈ రాజకీయ పరిణామాలపై టీఎంసీ నేత కుమాల్‌ ఘోష్‌ మాట్లాడుతూ..ఆర్‌జీ కర్‌ ఘటనను దుర్వినియోగం చేయడం, ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయని పేర్కొన్నారు. సీపీఐఎం పాలన ఎలా ఉందో బెంగాల్‌ ప్రజలు చూశారు.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కమలం పాలన ఎలా ఉందో గమనిస్తున్నారని విమర్శించారు. ఇక, ఆర్‌జీ కర్‌ ఘటన కేసు నిందితుణ్ని కోల్‌కతా పోలీసులు 24 గంటల్లో అదులోకి తీసుకున్నారు.. ప్రభుత్వ పని తీరుకు ఇదే నిదర్శనం అని చెప్పుకొచ్చారు. మేం అన్నీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల పశ్చిమ బెంగాల్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆరుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పోటీ చేసి గెలిచారు. దీంతో ఆరు సిట్టింగ్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతుంది.

Exit mobile version