ప్రతి నెల ఒకటో తారీఖున ఆర్థిక లావాదివేలతో పాటుగా దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అదే విధంగా ఈ నెల కూడా అనేక వాటిల్లో మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది.. కొత్త ఏడాది జనవరి నెల పూర్తి అయ్యింది.. ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చేసింది.. ఈ నెలల్లో అనేక మార్పులు జరిగాయి.. ఎన్పీఎస్ లో చాలా మార్పులు వచ్చాయి.. ఎన్‌పీఎస్ ఖాతాదారుల ఖాతా నుంచి విత్ డ్రా నిబంధనల్లో ఈ మార్పులు ఉంటాయని తెలిపింది. డిపాజిట్ చేసిన మొత్తంలో 25 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు.. ముందుగా డిక్లరేషన్ ఫామ్ ను కూడా సర్పించాలి..
ఇదొక్కటే కాదు బ్యాంకులకు కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషన్ హోమ్ లోన్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన తగ్గింపు అన్ని గృహ రుణాలకు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. ప్రాసెసింగ్ ఫీజులు, రుణాలపై రాయితీ ఇవ్వనుంది.. సామాన్యులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.. లబ్ధిదారుని పేరు ఎంటర్ చేయకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ. 5 లక్షల వరకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది..
అలాగే ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవల కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా మొబైల్ నంబర్, బ్యాంక్ పేరుతో ట్రాన్సాక్షన్ ను త్వరగా పూర్తి చేసుకోవచ్చు.. అలాగే టెక్ ఉద్యోగుల లేఆఫ్‌ల పరంపర కొనసాగింది. కేవలం జనవరి నెలలోనే 24,564 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.. ఇక ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ కూడా చేసుకోవాలి.. గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..