India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
- బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు
- సరిహద్దుల్లో కంచె నిర్మాణంపై BSF–BGB మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి
- 4,096 కి.మీ భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా బలగాల మోహరింపు
- బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ దూకుడు వెనుక స్మగ్లింగ్, చొరబాట్ల ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. చాలా ఏళ్లుగా బెంగాల్లో పాతుకుపోయిన బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సొంతదేశానికి పయణమవుతున్నారు. దీంతో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులకు జనాలు పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే ఈ పరిణామాలు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ సరిహద్దుల్ని రక్షించే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ (BGB) సిబ్బందికి నచ్చడం లేదు. దీంతో సరిహద్దుల్లో మన భూభాగంలోనే కంచె నిర్మిస్తున్న భారత సరిహద్దు భద్రతా దళం (BSF)తో ఘర్షణకు దిగుతున్నారు.
బీఎస్ఎఫ్ వర్సెస్ బీజీబీ:
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత పొడవైన భూ సరిహద్దులలో ఒకటి. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది. 4096 కి.మీ సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్ వైపు బీజీబీ ఉంటే, మన వైపు బీఎస్ఎఫ్ ఉంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దు దళం మొత్తం బలం 70,000లుగా అంచనా, మన బీఎస్ఎఫ్ బలం 2,70,000.
బీజీబీ దురాక్రమణ ఎందుకు.?
ఇటీవల నెలల్లో భారత్ సరిహద్దుల్లో కంచె నిర్మిస్తుంటే, బీజీబీ తరుచుగా అడ్డుకుంటోంది. భారత్ అంతర్జాతీయ సరిహద్దు నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని వాదిస్తోంది. 150 గజాల నో మ్యాన్స్ ల్యాండ్‌లో అక్రమంగా కంచె నిర్మిస్తున్నట్లు వాదిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం గత కొంత కాలంగా రెండు దళాల మధ్య వందలాది సమావేశాలు జరిగాయి.
ఇటీవల కాలంలో బీజీబీ దూకుడు మరింతగా పెరిగింది. బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకుని, స్థానిక బంగ్లా ప్రజల సహకారంతో బీఎస్ఎఫ్పై దాడికి ప్రయత్నిస్తోంది. సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్ స్మగ్లర్ల రాకపోకలు, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమ సరఫరా వంటి వాటికి బీజీబీ సహకరిస్తోంది. ఇప్పుడు కంచె నిర్మిస్తే తమ ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఇలాంటి ఘర్షణను కోరుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే సరిహద్దుల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!