BRS Kisan Cell President Gurnam Singh Comments: దేశంలో పెద్ద మార్పు రావాలని, పేదలు,రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు లేవని అన్నారు భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు,పేదలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బంధు,రైతు భీమా సహా అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని.. తెలంగాణలో అందుతున్న సంక్షేమ ఫలాలు యావత్ దేశానికి అందించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని ఆయన వెల్లడించారు.
హర్యానా,పంజబ్, బీహార్,కర్ణాటక,తెలంగాణ, మహారాష్ట్ర పై మొదటగా దృష్టి సారించాం అని..ఆరు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. రైతులు రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని.. రైతుల నుంచి బీఆర్ఎస్ పట్ల మంచి స్పందన ఉందన్నారు. దేశంలో ప్రతీ మూలకు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తామని అన్నారు. త్వరలోనే కేసీఆర్ బీఆర్ఎస్ విధానాలను ప్రకటిస్తారని తెలిపారు.
Read Also: Kamal Haasan: భారత్ జోడో యాత్ర.. రేపు రాహుల్ గాంధీతో పాల్గొననున్న కమల్ హాసన్..
గుజరాత్ మోడల్ తో దేశాన్ని అమ్మేశారని.. పంటభూములు, రైళ్లు, పోర్టులు అన్ని అమ్మేశారని.. తెలంగాణలో ప్రభుత్వ రైతుల పక్షాన ఉందని.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఫలాలు యావత్ దేశంలో అమలు చేస్తామని వెల్లడించారు. రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి అందరికి అందడం లేదని.. మిగతా పార్టీలు అధికారం, డబ్బు కోసం పనిచేస్తున్నాయని.. బీఆర్ఎస్ అలా లేదని అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరా అని తెలిపారు.
దేశాన్ని మార్చేందుకు కేసీఆర్ వద్ద అనేక ప్రణాళికలు ఉన్నాయి. త్వరలోనే అవన్నీ కేసీఆర్ ప్రకటిస్తారు అని గుర్నామ్ సింగ్ తెలిపారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ లాగే పథకాలను అమలు చేయవచ్చు కానీ అక్కడి ప్రభుత్వాలు ఇవ్వడం లేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుల ఆందోళనలే ఉండవని ఆయన వెల్లడించారు. తెలంగాణలో 8 ఏళ్లలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని.. బీఆర్ఎస్ లో రైతులే నేతలుగా ఉంటారని.. చట్టాలు చేసే వారే రైతులుగా ఉంటార అని అన్నారు.