S.Jaishankar: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై లోక్‌సభలో మాట్లాడిని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ బంగ్లాలోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటిని నివారించడానికి ఆ దేశ తాత్కాలిక సర్కార్ మైనారిటీలు, హిందువుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంపై ఇటీవల భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అక్కడికి వెళ్లి వారితో చర్చలు జరిపారని సభలో తెలిపారు. మరోవైపు పాకిస్థాన్, భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే ఆ దేశంలో ఉగ్రవాదం పూర్తిగా తుడిచి పెట్టుకుపోవాలి.. అప్పుడే పాక్‌తో చర్చలకు ముందడుగు వేస్తామని జైశంకర్ వెల్లడించారు.
Read Also: Allu Arjun Arrest: హీరో అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష?
ఇక, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వదిలి పోయిన తర్వాత బంగ్లాలో హిందువులపై దాడులు బాగా పెరిగిపోయాయి. అలాగే, ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఆయనకు న్యాయసాయం అందించడంపై కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఇద్దరు బంగ్లాదేశ్ దౌత్యవేత్తలను వెనక్కి రప్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢాకా నుంచి పని చేయాలని సూచనలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు క్లిష్టమైయ్యాయి.
Read Also: Allu Arjun Arrest Live Updates: హీరో ల్లు అర్జున్ అరెస్ట్.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు!
అయితే, షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ నివేదికలో తెలిపింది. ఇక, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అధికార ఎన్‌డీఏ, విపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇవాళ లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది.