వరుడి చెంప చెల్లుమనిపించిన వధువు.. కుటుంబ సభ్యులపై గ్రామస్తుల దాడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి జరుగుతుందంటే.. వరుడికి.. వధువు చాలా మర్యాద ఇవ్వాలి.. ఇక, పెళ్లి అయిపోయిన కొత్తలో అయితే.. సిగ్గు, బియడం లాంటివి సినిమాల్లో చూస్తుంటాం.. కొన్ని సినిమాలు వేరుగాఉంటాయి.. అయితే, ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి జరిగింది.. ఆ వెంటనే రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేశారు.. కాసేపట్లో అదికూడా ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ, అక్కడే ఒక చిక్కు వచ్చిపడింది.. కొత్త మెలిక పెట్టాడు పెళ్లి కుమారుడు.. దానికి వధువు కుటుంబం తమకు స్తోమత లేదంటూ ఒప్పుకోలేదు.. మరోవైపు ఆ యువకుడు మొండికేశాడు.. ఈ తంతంగాన్ని అంతా పక్కనే ఉండి గమనిస్తున్న పెళ్లికూతురుకు కోపం కట్టలు తెచ్చుకుంది.. పెళ్లి మండపంపైనే అతడిని పట్టుకు చెంపలువాయకొట్టింది..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా సలీమ్‌పూర్‌లో నాసిమ్ అహ్మద్ అనే వ్యక్తి కుమార్తెకు మహమ్మద్ ఇమ్రాన్ సాజ్‌తో ఈనెల 17వ తేదీన పెళ్లి చేశారు.. ఇక, బరాత్ కార్యక్రమం కూడా ధూంధాంగానే జరిగింది.. ఆ తర్వాత రిసెప్షన్ కు ఏర్పాట్లు చేశారు.. కానీ, పెళ్లికూతురు, పెళ్లి కొడుకు ముస్తాబయ్యారు.. కార్యక్రమం ప్రారంభం అయ్యే సమయానికి తనకు వరకట్నం కింద తనకు బుల్లెట్ కావాలంటూ వరుడు పట్టుబట్టాడు.. వధువు కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా.. వినలేదు.. ఇది కాస్త పెద్దగా మారిపోయి.. ఇరు కుటుంబాల మధ్య వివాదంగా మారింది.. దీంతో.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వధువు.. వరుడి వద్దకు వెళ్లి చెంప చెల్లుమనిపించింది.. రెండు, మూడుసార్లు చెంపలు గట్టిగానే వాయించింది.. ఇక, వధువు కుటుంబానికి మద్దతుగా ఆ గ్రామస్తులు.. వరుడి కుటుంబసభ్యులు, బంధువులపై దాడికి దిగారు.. ఇలా చిలికిచిలికి గాలివానగా మారిపోయింది వ్యవహారం.. పోలీసుల జోక్యం చేసుకుని నచ్చజెప్పాలని చూసినా వరుడు వినిపించుకోలేదు. తనకు విడాకులు కావాల్సిందేనని మొండికేయడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Tags
- reception
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!