NTV Telugu Site icon

Marriage Contract: భర్తకు భలే ఆఫర్‌.. పెళ్లిలోనే బాండ్‌ రాసిచ్చిన వధువు

Marriage Contract

Marriage Contract

ఈ మధ్య పెళ్లి ముందే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి.. పెళ్లి అయిన తర్వాత అలా ఉండు.. ఇలాగే ఉండాలి అనే ఆంక్షలు పెట్టకుండా.. పెళ్లికి ముందే.. ఓ అంగీకారానికి వచ్చేస్తున్నారు.. తాజాగా కేరళకు చెందిన జంట మధ్య జరిగిన ఒప్పందం ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది.. ఇంతకీ.. వాళ్ల మధ్య జరిగిన అగ్రిమెంట్‌ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు వివాహం నిశ్చయించారు పెద్దలు.. ఇద్దరికీ ఈ నెల 5వ తేదీన పాలక్కాడ్లోని కంజికోడ్‌లో వివాహం జరిగింది. అయితే, పెళ్లి సందర్భంగా ఈ జంట మధ్య కుదిరిన ఒప్పందం.. సోషల్‌ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తుంది..

Read Also: Warangal Crime: మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యం.. మనిషేనా..?

ఇంతకీ వారి మధ్య జరిగిన అగ్రిమెంట్‌ ఏంటంటే.. పెళ్లి తర్వాత తన భర్త.. రాత్రి 9 గంటల వరకు స్నే హితులతో బయట తిరిగేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. అంతేకాదండోయ్.. ఆ సమయంలో ఆమె తన భర్తకు ఎలాంటి కాల్స్‌ కూడా చేయరాదు అని అగ్నిమెంట్‌లో రాసుకున్నారు.. ఈ కండీషన్స్‌కు వధువు అర్చన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.. ఈ అగ్రిమెంట్‌ను 50 రూపాయల బాండ్ పేపర్‌పై ప్రింట్‌ తీయించారు.. దానిపై వధువు సంతకం పెట్టగా.. ఈ బాండ్ పేపర్‌ను వరుడు రఘు స్నేహితులు ఆ కొత్త జంటకు గిఫ్ట్‌గా అందించారు.. ఇక, ఏదైనా కాస్త కొత్తగా కనిపిస్తే.. ఇట్టే సోషల్‌ మీడియాకు ఎక్కించి వైరల్‌ చేసే నెటిజన్లు. ఆ అగ్రిమెంట్‌ను కూడా వైరల్‌ చేస్తూ.. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక, రఘు కంజికోడ్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి కాగా అర్చన బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతోంది. 17 మంది బ్యాడ్మింటన్ ప్లేయర్‌లతో కూడిన వాట్సాప్ గ్రూప్‌లో రఘు ఒకరిగా ఉన్నారట.. వారి పెళ్లి రోజున స్నేహితులకు సర్ప్రైజ్‌లు ఇవ్వడం స్నేహితుల ఆచారం అట.. ఒప్పంద పత్రం కూడా వాటిలో ఒకటి అంటున్నారు..

Show comments