మూడు ముళ్లు ఏడు అడుగులు వేస్తే పెళ్లి అయిపోతుంది. సామాన్యంగా జరుపుకునే పెళ్లిళ్లలో ఎలాంటి హడావుడి కనిపించదు. కానీ, కొన్నిచోట్ల పెళ్లిళ్లలో హడావుడి చేస్తుంటారు. గతంలో పెళ్లికొడుకు రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఇలాంటి ఘటన మరోకటి యూపీలో జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్ జిల్లాలోని జెథ్వారా ప్రాంతానికి చెందిన రూపా పాండే అనే యువతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక జరిగే సమయంలో పెళ్లి కూతురు స్టేజీ ఎక్కుతూ రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈ తతంగాన్ని కొంతమంది విడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పెళ్లికూతురు రూపా పాండే, ఆమె మామ రామ్ నివాస్ పాండేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.