NTV Telugu Site icon

UP: పెళ్లైన 2 రోజులకే బిడ్డకు జన్మనిచ్చన వధువు.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే..!

Upwedding

Upwedding

పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఇక నూతన దంపతులు రెండు రోజులు ఆనందంగా గడిపారు. వధువు.. అత్తింటిలో అడుగుపెట్టిన దగ్గర అందరినీ మర్యాదగా చూసుకుంటోంది. రెండోరోజు సాయంత్రం అందరికీ టీ అందించింది. కోడలు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డారు. ఇంతలోనే వధువు పెద్ద పెద్ద కేకలు వేసింది. దీంతో అత్తింటి వారంతా అల్లాడిపోయారు. ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి తొమ్మిది నెలల గర్భవతిని తేల్చారు. అంతే ఈ వార్త తెలియగానే అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.

ఫిబ్రవరి 24న అమ్మాయి-అబ్బాయికి వివాహం జరిగింది. చాలా గ్రాండ్‌గా వివాహ వేడుకలు జరిగాయి. జస్రా గ్రామంలో భారీగా ఊరేగింపు కూడా నిర్వహించారు. ఈ వేడుకలు రాత్రి పొద్దుపోయే వరకు జరిగాయి. దీంతో మరుసటి రోజు ఫిబ్రవరి 25న వధువును ఆమె అత్తమామల ఇంటికి పంపించారు. కోడలు ఇంట్లోకి రాగానే ఎంతో సంతోషించారు. అతిథులు, ఇరుగుపొరుగు వారంతా ఆనందించారు. ఫిబ్రవరి 26న ఉదయం అందరికీ టీ అందించింది. అదే సాయంత్రం ఒక్కసారి నొప్పి వస్తుందంటూ కేకలు వేసింది. భయపడిన కుటుంబ సభ్యులు కార్చన సీహెచ్‌సీ ఆస్పత్రి తరలించారు. వైద్యులు పరీక్షించి తొమ్మిది నెలల గర్భవతి అని తేల్చారు. వెంటనే ప్రసవం అవసరమని వైద్యులు వెల్లడించారు. రెండు గంటల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

వధువు గర్భవతి విషయాన్ని దాచి పెట్టారని వరుడి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. అయితే గత మే నెలలోనే పెళ్లి సంబంధం కుదరగానే… అమ్మాయి-అబ్బాయికి శారీరక సంబంధం ఏర్పడిందని వధువు తండ్రి పేర్కొన్నాడు. ముందు నుంచీ సంబంధం ఉందని తెలిపాడు. అయితే వధువు తండ్రి వాదనను వరుడు తోసిపుచ్చాడు. ఆమెను అంగీకరించే ప్రసక్తేలేదని తేల్చాడు. వరుడు తండ్రి కూడా నిరాకరించాడు. తమ కుమార్తెను అంగీకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వధువు తల్లి హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వివాదం గ్రామ పంచాయతీకి చేరింది. ప్రస్తుతం బిడ్డతో కలిసి వధువు పుట్టింటికి చేరింది.