Union Minister Suresh Gopi: ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. గిరిజన వ్యవహారాల శాఖను అగ్ర వర్ణాల వారికి ఇవ్వాలని అన్నారు. అలా చేయడంతో నిజమైన పురోగతి లభిస్తుందన్నారు. గిరిజన సమాజానికి చెందిన వ్యక్తి మాత్రమే ఆ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.. ఇది మన దేశానికి శాపంగా మారింది.. ఒక బ్రాహ్మణుడు లేదా నాయుడు గిరిజన శాఖ బాధ్యతలు చేపడితే గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి మార్పు జరుగాలని కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపి అన్నారు.
Read Also: Vivo X200 Pro Mini: క్రేజీ ఫీచర్లతో వివో ఎక్స్200 ప్రో మినీ ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే?
అలాగే, గిరిజన వ్యవహారాల శాఖను నిర్వహించాలనే తన కోరికను కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి చెప్పుకొచ్చారు. ఇక, ఆ మంత్రిత్వ శాఖను తనకు కేటాయించాలని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడనీ కోరినట్లు తెలిపారు. కానీ, శాఖల కేటాయింపులో కొన్ని విధానాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు, కేంద్రమంత్రి సురేష్ గోపి చేసిన ఈ వ్యాఖ్యలపై కేరళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బెనోయ్ విశ్వం తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పాటు కుల వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన సురేష్ గోపితో పాటు విద్య, సంక్షేమంలో కేరళ వెనుకబడిందని రాష్ట్రాన్ని అవమానించిన మరో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్‌ను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.