Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
- నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు ఆగ్రహం..
- అమెరికా పౌరసత్వం ఉండీ, భారత్‌లో నిరసనలా?
- ఇదే అమెరికాలో చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
- బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల్లో పాల్గొన్న కారణంగా, దేశం విడిచి పెట్టి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు కలిగి ఉన్నారని కోర్టు గుర్తుచేసింది. భారత పౌరుడిలా వ్యవహరించలేరని స్పష్టం చేసింది. ఒక భారతీయులు అమెరికాలో ఇలాంటి నిరసనల్లో పాల్గొంటే ఆ దేశం ఎలా స్పందిస్తుందో ఆలోచించాలని వ్యాఖ్యానించింది.
‘‘మీరు విదేశీ పౌరుడు, భారతీయ పౌరుడిగా వ్యవహరించలేరు, SIR గురించి మాట్లాడటానికి మీకు ఎలాంటి హక్కు లేదు, నిరసనల్లో పాల్గొనే హక్కు మీకు లేదు. కోర్టుకు స్పష్టమైన హామీ ఇవ్వాలి’’ అని హైకోర్టు ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. 42 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ తన జీవితమంతా భారత్‌లోనే గడిపారని, ఆమెరికాలో జన్మించిన కారనంగా మాత్రమే అక్కడి పౌరసత్వం పొందారని ఇమ్రాన్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆయన భారత పౌరుడు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అని పేర్కొంది.
Also Read
- Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
- Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
- Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
- Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
చిన్నప్పటి నుంచి భారత్‌లోనే నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్ భారత పౌరసత్వం ఎందుకు స్వీకరించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. భారత్‌లో 4 దశాబ్దాలకు పైగా నివసించడం వల్ల తాను అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తిననే విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ మరిచిపోయినట్లు ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
కోర్టు ఆగ్రహం చేసిన వేళ, ఈ వ్యవహారంలో నిరసన నిర్వాహకులతో తనకు ఎలాంట సంబంధం లేదని, దీనిపై అఫిడవిట్ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. భారత్‌లోనే ఉండేందుకు అనుమతించాలని కోరారు. అయితే, కేవలం అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోదని, ఇమ్రాన్ ఖాన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోర్టు సూచించింది. ఇదే తరహా చర్యలు భారత్ పౌరుడు విదేశాల్లో పాల్పడితే, తర్వాతి విమానంలోనే అతడిని భారత్‌కు పంపించేవారు అని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
-
Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు.. ఢాకాలో తీవ్ర హింస.
-
YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
-
Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!