Lateral Entry Row: బ్యూరోక్రసీలో లాటరల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) అధిపతికి లేఖ రాశారు. ఇటీవల యూపీఎస్‌సీ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాలకు లాటరల్ ఎంట్రీ నియామకాల కోసం ‘‘ప్రతిభావంతులైనవారిని’’ కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. 24
Rahul Gandhi: లాటరల్ ఎంట్రీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ విధానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి అని సోమవారం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రామరాజ్యాన్ని వక్రీకరించి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.