NTV Telugu Site icon

Devendra Fadnavis: ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఓటర్లకు ఇష్టం లేదు..

Fadnavis

Fadnavis

Devendra Fadnavis: 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోర వైఫల్యంపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి ఓట్ల బదిలీ జరగకపోవడమే కారణమని గురువారం అన్నారు. ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ప్రధాన ఓటర్లు ‘‘కోర్ వోటర్ బేస్’’కి నచ్చలేదని అన్నారు. అయితే, 80 శాతం మంది మాత్రం ఇప్పుడు అలాంటి రాజకీయాల్లో రాజీ అవసమని ఎన్నికల ద్వారా ఒప్పుకున్నారని ఆయన అన్నారు.

బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(ఏక్‌నాథ్ షిండే) అధికార కూటమి మొత్తం మహారాష్ట్రలోని 48 లోక్‌సభస స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంటి. 2019లో సొంతగా 23 ఎంపీ స్థానాలను సాధించిన బీజేపీ ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది.

Read Also: Rachana Banerjee: ‘‘ క్వింటాల్ క్వింటాల్ వాటర్’’.. ఒకప్పటి తెలుగు హీరోయిన్, ఎంపీపై ట్రోలింగ్..

గత కొన్ని సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చెత్త ప్రదర్శన చేశామని, మేము 28 స్థానాల్లో పోటీ చేస్తే, చాలా తక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. మేము 3 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో 12 సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. 3000 -6000 తేడాలో ఓడిపోయామని అన్నారు. ఈ ఎన్నికల్లో షిండే 07, అజిత్ పవార్ 01 సీట్లనను గెలుచుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఇది పునరావృతం కాదని స్పష్టం చేశారు.

శివసేన తన ఓట్లను బీజేపీకి బదిలీ చేయడం సులభం, ఎందుకంటే రెండు పార్టీలు చాలా ఏళ్లుగా పొత్తులో ఉన్నాయని, మేం ఎప్పుడూ ఎన్సీపీకి వ్యతిరేకంగా పోటీ చేశామని, అందువల్ల ఆ ఓట్లను బదిలీ చేయడం కష్టమైందని అన్నారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల ఓటర్ల బేస్ స్థిరపడిందని ఫడ్నవీస్ చెప్పారు. తమ కూటమి అవశ్యకతను కార్యకర్తలకు చెప్పి ఒప్పించామని, మా ఓటర్లలో కనీసం 80 శాతం మంది ఇప్పుడు ఎన్సీపీతో పొత్తును ఒప్పుకున్నారని అన్నారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ సీట్లలో పోటీ గురించి 80 శాతం చర్చలు ముగిశాయని అన్నారు. నవంబర్ నెలలో మహారాష్ట్ర ఎన్నికలు జరగే అవకాశం ఉంది.