Annamalai: డీఎంకే తమిళనాడుకి శత్రువు.. కోయంబత్తూర్ రోడ్ షోలో అన్నామలై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై అధికార డీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. కోయంబత్తూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన ఈ రోజు భారీ రోడ్ షో నిర్వహించారు. మదురైలోని తెప్పకుళం మైదానంలో ఉదయం 11 గంటలకు ఈ రోడ్ షో ప్రారంభమైంది. తమిళనాడుకి, తమిళ ప్రజలకు డీఎంకే శత్రువుగా మారిందని ఆయన ఆరోపించారు. మోడీ మార్గంలోకి తమిళనాడు వస్తుందని జూన్ 4న వెలువడే ఫలితాలు ధ్రువీకరిస్తాయని అన్నామలై అన్నారు.
Read Also: Earth: భూ ఉపరితలం కింద 700 కి.మీ. దిగువన భారీ సముద్రం.. సైంటిఫిక్ డిస్కవరీ వైరల్..
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
కోయంబత్తూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మార్చి 28న అన్నామలై నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అన్నామలై 2019లో సర్వీసుకు రాజీనామా చేసి 2020లో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన ఏడాదికే బీజేపీ అధిష్టానం ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. ఈసారి తమిళనాడులో బీజేపీ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రధాని మోడీతో పాటు అన్నామలై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మొత్తం 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 19న మొదటిదశలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 23, 08 లోక్ సభ స్థానాలను గెలుచుకున్నాయి. సీపీఐ రెండు, సీపీఎం, ఐయూఎంల్ఎల్ ఒక్కోస్థానాన్ని దక్కించుకోగా.. రెండు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ఏడు దశల్లో జరుగుతాయి. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!