PM Modi Reaction: దీదీ కోటలో మోడీ సునామీ.. బెంగాల్ గడ్డపై ఎగిరిన కాషాయ జెండా! ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Reaction: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటను బద్దలు కొట్టి, బీజేపీ సాధించిన ఈ ఘన విజయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ప్రజల శక్తికి నిదర్శనం
“పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇది ప్రజల శక్తికి దక్కిన విజయం. బీజేపీ అనుసరిస్తున్న సుపరిపాలన రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు” అని ప్రధాని పేర్కొన్నారు. బెంగాల్‌లోని ప్రతి ఒక్క పౌరుడికి తాను తలవంచి నమస్కరిస్తున్నట్లు ఆయన భావోద్వేగంతో తెలిపారు. ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. “బెంగాల్ ప్రజల కలలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం దక్కేలా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
The Lotus blooms in West Bengal!
The 2026 West Bengal Assembly Elections will be remembered forever. People's power has prevailed and BJP's politics of good governance has triumphed. I bow to each and every person of West Bengal.
The people have given a spectacular mandate to…
— Narendra Modi (@narendramodi) May 4, 2026
మరో పోస్ట్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ చారిత్రాత్మక విజయం అకస్మాత్తుగా వచ్చింది కాదు. కొన్ని తరాలుగా ఎంతోమంది కార్యకర్తలు చేసిన పోరాటం, పడ్డ కష్టం దీని వెనుక ఉంది. క్షేత్రస్థాయిలో ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అభివృద్ధి అజెండాను ప్రజల దగ్గరకు తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకూ నేను సెల్యూట్ చేస్తున్నాను. వారే మా పార్టీ అసలైన బలం” అని కొనియాడారు. ఈ గెలుపుతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ శ్రేణులు పండుగ వాతావరణంలో మునిగిపోయారు. కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
BJP’s record win in West Bengal would not be possible without the efforts and struggles of countless Karyakartas over generations. I salute them all. For years, they have worked hard on the ground, overcome all sorts of adversities and spoken about our development agenda. They…
— Narendra Modi (@narendramodi) May 4, 2026
తాజావార్తలు
-
Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
-
Off The Record : ఏపీ కూటమిలో సీట్ల సంకటం! టీడీపీకి షాక్ ఇస్తున్న జనసేన, బీజేపీ?
-
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
-
TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!