Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే, ఈ వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే తర్విందర్ సింగ్ మార్వా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.