Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. విదేశాలకు వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడుతున్నాడని బీజేపీ మండిపడుతోంది. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండీ, భారత అంతర్గత విషయాలపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ అమెరికా శాసనసభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌తో భేటీ అయ్యారు.
Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో జరిగిన ఇంటర్వ్యూలో ఇండియా జోడో యాత్ర గురించి మాట్లాడారు.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 8-10 తేదీల మధ్య ఆయన యూఎస్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లలోని టెక్సాస్ యూనివర్సిటీ సహా పలువురుని కలవనున్నారు. జూన్ నెలలో లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లబోతున్నారు.