UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
- యూపీ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 350 సీట్లు..
- అమిత్ షా సమావేశంలో కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. మూడోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన స్ట్రాటజిస్టులు యూపీలో మాకాం వేశారు. ఇదిలా ఉంటే, రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 402 స్థానాలకు గానూ 325 నుంచి 350 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడోసారి తప్పకుండా అధికారంలోకి రావాలని కేంద్రహోం మంత్రి అమిత్ షా యూపీ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం లక్నోలో జరిగిన యూపీ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు.
కేంద్ర మంత్రి పంకజ్ చౌధురి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా లక్నోలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు ఈ కార్యక్రమానికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి వినోద్ తావ్డే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ, గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ తదితరులు హాజరయ్యారు.
Also Read
- BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
- INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
- Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
2027 ఎన్నికల్లో 2017 నాటి విజయాన్ని రిపీట్ చేయాలని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వ్యక్తిగత ఆశలు, ఆశయాలను పక్కనపెట్టి 325 నుంచి 350 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మరో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ 337 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యోగి నాయకత్వంలో యూపీ చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. ఇదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే సూత్రంతో పనిచేస్తే, సమాజ్‌వాదీ పార్టీ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
-
Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు..
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!