Rahul Gandhi: రోహిత్ వేముల ఆత్మహత్యను రాజకీయం చేసినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు క్లోజర్ రిపోర్టును ఇచ్చారు. హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్న రోహిత్ వేముల మృతిపై తెలంగాణ పోలీసులు విచారణ ముగించారు. తుది నివేదికను దాఖలు చేశారు. తాను ఎస్సీ కులానికి చెందినవాడిని కాదని గుర్తించడంతో, అసలు కులం బయటపడుతుందనే భయంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. ఇది నిజమైతే తన అకడమిక్ డిగ్రీలను కోల్పోతాననే, విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి ఉండొచ్చని నివేదిక పేర్కొంది.
Read Also: Canada: ఖలిస్తాన్ ఆందోళనలపై రాజకీయాలను ప్రభావితం చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది..
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
తాజాగా ఈ రిపోర్టు పొలిటికల్ దుమారానికి కారణమవుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దళితులను రాజకీయ ప్రయోజనాల కోసం దోపిడి చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. రోహిత్ వేముల మరనాన్ని రాజకీయాల కోసం వాడుకున్న రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణ పోలీసులు రోహిత్ వేము దళితుడు కాదని, ఇది ఆత్మహత్యే అని రిపోర్టు ఇచ్చారని, రాహుల్ గాంధీ దళితులకు క్షమాపణ చెబుతారా..? అని కమలం పార్టీ ప్రశ్నించింది.
ఈ సమస్యను రాజకీయం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. రోహిత్ వేముల మరణాన్ని రాహుల్ గాంధీ తన నీచ రాజకీయాల కోసం ఉపయోగించాడని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ మరియు సో కాల్డ్ ‘సెక్యులర్’ పార్టీలు దళితులను తమ రాజకీయాల కోసం తరచుగా ఉపయోగించుకున్నాయి కానీ వారికి న్యాయం చేయడంలో ఎప్పుడూ విఫలమవుతున్నాయి. ఇది అందుకు మరో ఉదాహరణ’’ అని ఆయన పోస్ట్ చేశారు.
Rahul Gandhi used floor of the House to politicise Rohit Vemula’s death for his ugly politics. Now that Telangana Police, under a Congress Govt, has filed a closure report, stating that Vemula did not belong to the SC community and died by suicide, will Rahul Gandhi apologise to… pic.twitter.com/xkdEx7zgiq
— Amit Malviya (@amitmalviya) May 4, 2024
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్‌లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!