BJP Leader: అమెరికా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు కాబోతున్న మొదటి ముస్లిం మేయర్‌గా మమ్దానీ చరిత్ర సృష్టించారు. దీని తర్వాత, ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము ఏ ఖాన్‌ను ముంబై మేయర్‌గా అనుమతించం’’ అని అన్నారు. ఓట్ జిహాద్ ద్వారా న్యూ్యార్క్ నగరంలో కనిపించే విధంగా ముంబైకి రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
BJP: రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ముంబై నగర భద్రత కోసం ఒక ‘‘ఖాన్’’ నగర మేయర్ కాకూడదని ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి బీజేపీ ముంబై చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి పియూష్ గోయల్ హాజరైన బీజేపీ విజయ్ సంకల్ప్ మేళావాలో అమీత్ సతం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ముంబై సురక్షితంగా ఉంచడమే యుద్ధం. విదేశీ చొరబాట్లు పెరుగుతున్నాయి. వారు తమ రంగును మారుస్తున్నారు. కొన్ని నగరాల మేయర్ల ఇంటిపేర్లు చూడండి.…