BJP MP Chhedi Paswan comments on CM nistish kumar: బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీతో జట్టు కట్టిన సీఎం నితీష్ కుమార్ పై బీజేపీ విమర్శల పదును పెంచింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ నితీష్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఆర్జేడీతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమయంలోనే బీహార్ వ్యాప్తంగా క్రైం రేటు పెరిగిపోయిందంటూ.. నేరాల జాబితాను కూడా విడుదల చేశారు. ఇక అస్సాం సీఎం హిామంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. మేం కూడా పార్టీలు మారాం కానీ.. నితీష్ లాగా పార్టీలు మారలేదని విమర్శించారు. హర్యానా హోం మంత్రి అనిల్ విజ్.. నితీష్ ఓ వలస పక్షి అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బీజేపేతర పార్టీలు మాత్రం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ లను ప్రశంసిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ ఛెడీ పాశ్వాన్ నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ నమ్మదగిన వ్యక్తి కాదంటూనే.. ప్రధాని పదవి కోసం నితీష్ కుమార్ దావూద్ ఇబ్రహీంతో చేతులు కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ ఆర్జేడీ పార్టీలో మహఘటబంధన్ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ససారం ఎంపీ ఛెడీ పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నితీష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రధాని కాలేడని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Shivamogga Subbanna: జాతీయ అవార్డు గ్రహీత.. ప్రముఖ సింగర్ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత
మరోవైపు బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ మాట్లాడుతూ.. అవినీతి విషయంలో నితీష్ కుమార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం అవినీతి కేసులు ప్రస్తుత బీహర్ ప్రభుత్వ మూసివేస్తారని అన్నారు. 2017లో ఆర్జేడీ అవినీతితో పొత్తు వీడారని.. ఇప్పుడు అదే ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ నేత సంజీవ్ చౌరాసియా మాట్లాడుతూ.. మీరు ఎవరి ముఖంతో ఎన్నికల్లో గెలిచారని..ప్రశ్నించారు. మీకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.