Site icon NTV Telugu

Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీకి 95వ ఓటమి’’.. అవార్డు ఇవ్వాలంటూ బీజేపీ ఎగతాళి..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయణిస్తోంది. మొత్తం 243 సీట్లలో 201 స్థానాల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 36 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసింది. గత రెండు దశాబ్ధాలలో రాహుల్ గాంధీ ‘‘95 ఎన్నికల్లో ఓడిపోయారు’’ అని చూపించే మ్యాప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాహుల్ గాంధీ ఓటములకు సంబంధించిన మ్యాప్‌ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2004-2025 మధ్య జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటముల్ని వివరించేలా గ్రాఫిక్ పోస్ట్ చేశారు.

Read Also: Bihar Election Results: రబ్రీ దేవిని ఓడించాడు, ఇప్పుడు తేజస్వీని ఓడిస్తాడా.? ఎవరీ సతీష్ కుమార్ యాదవ్..

‘‘”రాహుల్ గాంధీకి మరో ఎన్నికలో మరో ఓటమి వచ్చింది. ఎవరికైనా ఓడిపోవడంలో అవార్డు ఇస్తే, ఆయన రికార్డుల్ని కొల్లగొడుతారు. ఆయనను ఓటములు కూడా ఇంత సరిగ్గా ఎలా వెతుక్కుంటూ వస్తున్నాయో ఆశ్చర్యపోతున్నాను’’ అని మాల్వియా ట్వీట్ చేశారు. ఆయన ఎన్ని రాష్ట్రాల్లో ఓడిపోయారనే వివరాలను బీజేపీ షేర్ చేసింది. హిమాచల్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అనేక సార్లు ఆయన పార్టీ ఓడిపోయిందని బీజేపీ వివరాలతో చెప్పింది.

Exit mobile version