NTV Telugu Site icon

West Bengal: పశ్చిమ బెంగాల్ లో హైఅలర్ట్.. బంద్లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేలు అరెస్ట్..!

Kol

Kol

West Bengal: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆందోళనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలో విచారణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీజేపీ ఇవాళ (బుధవారం) 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్‌’ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం, బాష్ప వాయువు ప్రయోగించడం పట్ల కమలం పార్టీ మండిపడుతూ ఈ బంద్‌ చేపట్టింది. దీంతో బెంగాల్‌ పూర్తిగా స్తంభించింది.

Read Also: CM Chandrababu: కేబినెట్‌ భేటీ తర్వాత కీలక శాఖలపై నేడు సీఎం సమీక్ష..

అయితే, పలు చోట్ల దుకాణాలను మూసి వేస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. బంద్‌ కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. అలాగే, రైలు పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పాడింది. దీంతో బంద్‌ దృష్ట్యా విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అలర్ట్‌లు జారీ చేశాయి. మరోవైపు, భారతీయ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి ఇతర ప్రదేశాలకు తరలించారు. ఇదిలా ఉండగా.. ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలను నడుపుతున్నారు.