Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
- పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- బీజేపీ-అకాలీదళ్ మధ్య పొత్తుపై ఊహాగానాలు..
- మోడీతో భేటీ అయిన సుఖ్బీర్ సింగ్ బాదల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో శిరోమణి అకాలీ దళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఢిల్లీలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కలయికతో బీజేపీ-అకాలీదళ్ మధ్య మళ్లీ పొత్తు చిగురిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశం అనంతరం సుఖ్బీర్ బాదల్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి వంటి అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. పొత్తులు, ఎన్నికలపై ఇరు పార్టీలు కూడా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు.
25 ఏళ్ల పొత్తు.. వ్యవసాయ చట్టాలతో ముగింపు..
బీజేపీ, శిరోమణి అకాలీదళ్ దాదాపుగా 25 ఏళ్ల పాటు పంజాబ్ రాజకీయాల్లో కలిసి ఉన్నాయి. అయితే, 2020లో కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ముగిసింది. ఎన్డీయే కూటమి నుంచి అకాలీదళ్ వైదొలిగింది. ఆ తర్వాత 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. కానీ రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ఎన్నికల ముందు జోరుగా ఊహాగానాలు:
ఈసారి పంజాబ్ ఎన్నికల్లో 5 పార్టీల పోటీ నెలకొంది. అధికార ఆప్, కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్, అమృత్‌పాల్ సింగ్‌కు చెందిన వారిస్ పంజాబ్ దే పార్టీల మధ్య పోటీ ఉంది. మరోవైపు, వారిస్ పంజాబ్ దే పార్టీ పూర్తిగా సిక్కు రాజకీయాలపై ఆధారపడి ఉంది. ఇదే విధంగా సిక్కు రాజకీయాలపై ఎదిగిన అకాలీదళ్‌కు అమృత్ పాల్ సింగ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దేశవ్యతిరేక కార్యకలాపాల కింద ఎంపీ అమృత్ పాల్ సింగ్ జైలులో ఉన్నారు. అయినప్పటికీ, అతడి పార్టీ నెమ్మదిగా అకాలీదళ్ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మోదీ-సుఖ్బీర్ సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీతో కలిసి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని అకాలీదళ్ భావిస్తోంది. సిక్కు ఓట్లతో పాటు హిందూ ఓట్లను పొందిగే పంజాబ్‌లో విజయం సాధించే అవకాశం ఉందని లెక్కలు వేస్తోంది. మరోవైపు, బీజేపీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పంజాబ్ లో సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే గ్రామీణ ప్రాంతాల్లో సిక్కు ఓట్లను, పట్టణ ప్రాంతాల్లో హిందూ ఓట్లను సాధించే అవకాశాలు మెరుగవుతాయి.
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!