Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
- దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్
- దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
- ప్రజలు మాస్క్‌లు ధరించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం భారీ దుమ్ము తుఫాన్ కప్పేసింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నగరమంతా దుమ్ము తుఫాన్ కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దారి కనిపించక నానా తంటాలు పడ్డారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులైతే రహదారులు కనపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ దూరం రోడ్డు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: ఐపీఎస్‌ల పెళ్లితో ఎస్పీలో కుంపటి.. యూపీలో రాజకీయ దుమారం
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ఢిల్లీని తీవ్ర తుఫాన్ ఆవహించనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. రోజంతా మేఘావృతమై కొన్నిచోట్ల స్వల్ప జల్లులు పడే అవకాశముందని… మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో గంటకు 20–30 కి.మీ వేగంతో గాలులు వీచి.. 40 కి.మీ వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వర్ష సూచన..
ఏప్రిల్ 4 నుంచి 5 మధ్య ఒకటి లేదా రెండు సార్లు స్వల్ప నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని… ఈ సమయంలో ఉరుములు, మెరుపులు ఉంటాయని.. గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 6న మేఘావృతమై పెద్దగా వర్షం ఉండకపోవచ్చని పేర్కొంది. ఇక ఏప్రిల్ 7, 8 తేదీల్లో మళ్లీ స్వల్ప వర్షం, ఉరుములతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా దుమ్ము తుఫాన్ సమయంలో బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచించారు.
#WATCH | Delhi: The national capital experiences a severe dust storm that has significantly reduced visibility across the city.
(Visuals from Shanti Path) pic.twitter.com/OCCgsJN4JN
— ANI (@ANI) April 3, 2026
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!