Bed performance: ‘‘బెడ్ పర్ఫామెన్స్’’ కారణంగా బీహార్ టీచర్లకు జీతం కోత.. మీరు వింటున్నది నిజమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bed performance: బీహార్ రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరు ఏ విధంగా ఉందో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుంది. ఒక్క అక్షరం మారితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో ఇదే ఉదాహరణ. రాష్ట్రంలోని జాముయిలోని ఓ పాఠశాల ఉపాధ్యాయులకు శాలరీలు కట్ చేశారు. అయితే దీనికి కారణంగా చూపించిన విషయం తెలిసి కంగుతినడం ఖాయం. ‘‘బెడ్ పర్ఫామెన్స్(‘bed performance)’’ కారణంగా వీరు జీతం కోతను ఎదుర్కొన్నారు. అయితే, ‘‘బ్యాడ్ పర్ఫామెన్స్(bad performance) ’’ అని రాయడానికి బదులుగా ఒక్క అక్షరంతో మొత్తం అర్థమే మారిపోయింది. ఒకే పత్రంలో ఇలా 14 సార్లు తప్పులు పునరావృతమయ్యాయి.
Read Also: Hyderabad: ప్రియుడి వేధింపులు.. సూసైడ్ నోట్ రాసి ప్రియురాలి ఆత్మహత్య
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ప్రస్తుతం ఇది ఆన్లైన్లో ట్రోల్ అవుతోంది. గత వారం విద్యాశాఖ అధికారులు జాముయులోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అదే రోజు పలువురు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరయ్యారు. ఇంకా చాలా మంది పనితీరు సరిగా లేదని అధికారులు గుర్తించారు. తనిఖీల అనంతరం జాముయిలోని విద్యాశాఖ అధికారి(డీఈఓ) 16 మంది ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు లేఖను విడుదల చేశారు. తనిఖీల సమయంలో గైర్హాజరైనందుకు ముగ్గురు ఉపాధ్యాయులు చర్యలను ఎదుర్కొన్నారు. మరో 13 మంది పేలవమైన పనితీరుకు జరిమానా విధించారు. ఫలితంగా ఒక రోజు జీతం కట్ చేశారు.
దీనికి సంబంధించిన సర్య్కులర్ జారీ చేసే సమయంలో మే 22 నాటి అధికారిక ఆర్డర్లో ‘‘Bad’’కి బదులుగా ‘‘Bed’’ అని తప్పుగా రాశారు. దీంతో బ్యాడ్ పర్ఫామెన్స్ కాస్త ‘‘బెడ్ పర్ఫామెన్స్’’గా మారింది. దీంతో పూర్తి అర్థమే మారిపోయి పరువు పోయింది. వెంటనే విద్యాశాఖ తప్పును సరిదిద్దుకునేందుకు త్వరితగతిన కరెక్షన్ లెటర్ జారీ చేసింది. దీనిపై విద్యాశాఖ అధికారి రాజేష్ కుమార్ని సంప్రదించగా వివరణ ఇవ్వడానికి నిరాకరించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!