Bhojpuri songs: డబుల్ మీనింగ్ ‘‘భోజ్‌పురి సాంగ్స్’’పై పోలీసుల ఉక్కుపాదం..
- డబుల్ మీనింగ్ భోజ్‌పురి సాంగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..
- బహిరంగంగా వీటిని ప్లే చేస్తే ఇక కేసులు బుక్..
- అశ్లీలతకు మారుపేరుగా మారిన భోజ్‌పురి సాంగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhojpuri songs: భోజ్‌పురి సినిమాలు, అక్కడి పాటలు అశ్లీలతక కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ముఖ్యంగా మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే పాటలపై, సినిమాలపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా అక్కడి సిని పరిశ్రమ తీరు మార్చుకోవడం లేదు. ముఖ్యంగా మహిళ శరీరాన్ని ఉద్దేశిస్తూ ‘‘డబుల్ మీనింగ్’’ పాటలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే, ఇలాంటి డబుల్ మీనింగ్ భోజ్‌పురి సాంగ్స్‌పై చర్యలు తీసుకునేందుకు బీహార్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇది ఒక ‘‘ బర్నింగ్ ఇష్యూగా, సామాజిక సమస్య’’గా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఇది మహిళల భద్రతకు ముప్పు కలిగిస్తోందని, పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పోలీసులు చెప్పారు.
Also Read
- Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
Read Also: Minister: మహిళలు లిప్ స్టిక్‌తో పాటు కత్తి, కారం తీసుకెళ్లండి..
రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం శుక్రవారం జారీ చేసిన సర్క్యులర్‌లో అన్ని ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు (ఐజీలు), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు (డీఐజీలు), రైల్వే పోలీసులు బస్సులు, ట్రక్కులు, ఆటో-రిక్షాల్లో, ప్రజా కార్యక్రమాలలో ఇటువంటి పాటలు ప్లే చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
బీహార్ వ్యాప్తంగా ఈ సమస్య చాలా ఏళ్లుగా ఆందోళన కలిగిస్తోంది. అశ్లీల కంటెంట్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతిమ కుమారి రెండేళ్ల క్రితం అసెంబ్లీలో ఈ సమస్యని లేవనెత్తారు. సినిమాలు, సోషల్ మీడియాలో ఇలాంటి పాటల వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
-
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
-
OnePlus Nord CE 6: వన్‌ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్‌లో
-
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో