బీహార్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు జరగనుంది. ఇదిలా ఉంటే ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. క్రమక్రమంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. పోలింగ్ బూత్‌ల దగ్గర పెద్ద ఎత్తున మహిళలు క్యూ కట్టారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: జంగిల్ రాజ్ పాలనలో అభివృద్ధి శూన్యం.. మళ్లీ ఆ రోజులు కోరుకోవద్దన్న మోడీ
ఇక తొలి విడతలో భాగంగా పలువురు ప్రముఖులు ఓట్లు వేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భక్తియార్‌పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్ ఓటు వేయగా.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తన భార్యతో కలిసి హాజీపూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇక ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇది కూడా చదవండి: Erika Kirk: ఆ వీడియోను ఎప్పటికీ చూడబోను.. ఎరికా కిర్క్ వెల్లడి
ఇక మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన కుటుంబంతో కలిసి పాట్నాలో ఓటు వేశారు. అలాగే డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ కూడా తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి, విద్య, మంచి ఆరోగ్య సంరక్షణ కోసం ఓటు వేయాలని కోరారు. బీహార్ ప్రజలు వర్తమానం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి దశలో 121 స్థానాలకు.. రెండో దశలో 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న రెండు విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
बदलाव के लिए, नया बिहार बनाने के लिए, विकास के लिए, गुणवत्तापूर्ण शिक्षा और बेहतर स्वास्थ्य एवं विधि व्यवस्था तथा
नौकरी और रोजगार के लिए वोट करिए।𝐕𝐨𝐭𝐞 𝐟𝐨𝐫 𝐂𝐡𝐚𝐧𝐠𝐞
𝐕𝐨𝐭𝐞 𝐟𝐨𝐫 𝐍𝐞𝐰 𝐁𝐢𝐡𝐚𝐫
𝐕𝐨𝐭𝐞 𝐟𝐨𝐫 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭
𝐕𝐨𝐭𝐞 𝐟𝐨𝐫 𝐉𝐨𝐛𝐬… pic.twitter.com/jgyPNF8XgQ— Tejashwi Yadav (@yadavtejashwi) November 6, 2025
#WATCH | Darbhanga: VIP chief and Mahagathbandhan's Deputy CM face Mukesh Sahani, along with his family, cast his vote in the first phase of #BiharElection2025 pic.twitter.com/4ws5GLXAlz
— ANI (@ANI) November 6, 2025
