HDFC: హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు పెద్ద వార్త.. జూలై 1 నుంచి ఇవి వర్తిస్తాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పెద్ద వార్త చెప్పింది. మీ ఖాతా కూడా హెచ్‌డిఎఫ్‌సిలో ఉన్నట్లయితే మీరు ఈ వార్తలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి HDFC బ్యాంక్ మరియు HDFC లిమిటెడ్ విలీన తేదీ తెరపైకి వచ్చింది. వచ్చే నెల 1 జూలై 2023 నుండి అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ చైర్మన్ దీపక్ పరేఖ్ మంగళవారం ప్రకటించారు.
Read Also: Smart Phone Camera Cleaning: మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఇలా క్లీన్ చేసుకోండి..
Also Read
విలీనానికి ఆమోదం తెలిపేందుకు జూన్ 30న మార్కెట్ ముగిసిన తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బోర్డులు సమావేశమవుతాయని హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. గ్రూప్ వైస్-ఛైర్మెన్ మరియు CEO కేకి మిస్త్రీ ప్రకారం, HDFC స్టాక్ డీలిస్టింగ్ జూలై 13 2023 నుండి అమలులోకి వస్తుందన్నారు. అంటే జూలై 13న గ్రూప్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి తొలగించబడతాయి.
మరోవైపు జూన్ 30న రెండు కంపెనీల బోర్డులు సమావేశం కానున్నాయి. HDFC బ్యాంక్ మరియు HDFC లిమిటెడ్ విలీనం తర్వాత.. HDFC బ్యాంక్ ప్రపంచంలోని 5వ అత్యంత విలువైన బ్యాంకుగా అవతరిస్తుంది. అటు ఏప్రిల్ 2023 నాటికి HDFC బ్యాంక్ ప్రపంచంలో మార్కెట్ క్యాప్ పరంగా 11వ స్థానంలో ఉంది. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం.. జూన్ 30న పోస్ట్ మార్కెట్ అవర్స్‌లో రెండు కంపెనీల బోర్డులు సమావేశమై విలీనానికి ఆమోదం తెలుపుతాయని హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్ దీపక్ పారిఖ్ తెలిపారు.
HDFC బ్యాంక్ గత సంవత్సరం 4 ఏప్రిల్ 2022న HDFC లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి తన సమ్మతిని తెలియజేసింది. ఈ డీల్ విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లు. ప్రతిపాదిత యూనిట్ యొక్క ఉమ్మడి ఆస్తి బేస్ దాదాపు రూ. 18 లక్షల కోట్లు. దీని తరువాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 100 శాతం వాటా పబ్లిక్ షేర్హోల్డర్లచే నిర్వహించబడుతుంది. అంతేకాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రస్తుత వాటాదారులు బ్యాంకులో 41 శాతం వాటాను కలిగి ఉంటారు. HDFC లిమిటెడ్ యొక్క ప్రతి వాటాదారుడు ప్రతి 42 షేర్లకు HDFC బ్యాంక్ యొక్క 25 షేర్లను పొందుతారు.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!