NCERT: 12 తరగతి సిలబస్ నుంచి బాబ్రీ కూల్చివేత, గుజరాత్ అల్లర్ల అంశాలు తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCERT: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి స్కూల్ పుస్తకాల్లో కీలక మార్పులను చేసినట్లు తెలుస్తోంది. పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని తీసేసింది. దీంతో పాటు హిందుత్వ రాజకీయాలు, గుజరాత్ అల్లర్లు, మైనారిటీలకు సంబంధించిన కొన్ని సున్నితమైన అంశాలను పుస్తకాల నుంచి తొలగించనుంది. ఈ మార్పులతో కొత్త పుస్తకాలు 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబడనున్నాయి. NCERT ఈ మార్పులను గురువారం (ఏప్రిల్ 4) తన వెబ్సైట్లో పొందుపరిచింది. సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో NCERT పుస్తకాలు బోధించబడుతాయి. దేశంలో 30 వేలకు వరకు సీబీఎస్సీ స్కూల్స్ ఉన్నాయి.
Read Also: Fire Accident: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం.. విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్ధం
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో బాబ్రీ కూల్చివేత ప్రస్తావన ఉన్న పుస్తకంలో మూడు చోట్ల మార్పులు చేయాలని NCERT నిర్ణయించింది. దీనికి బదులుగా రామమందిర ఉద్యమాన్ని బోధించనున్నారు. దీంతో పాటు రామ మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన తీర్పునిచ్చిందో కూడా వివరంగా బోధించనున్నారు.‘స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ రాజకీయాలు’ పేరుతో ఉన్న 8వ అధ్యాయంలో ఈ మార్పు చేసింది. ఈ అధ్యాయం 2006-07లో పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో చేర్చబడింది. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన 5 ముఖ్యమైన భారత రాజకీయ పరిణామాలను ఈ అధ్యాయంలో చర్చించారు. దీంట్లో ఒకటి అయోధ్య ఉద్యమం.
ఇదే కాకుండా 1989లో కాంగ్రెస్ ఓటమి తర్వాత నాలుగు సంఘటనలను ప్రస్తావించారు. 1990లో మండల్ కమిషన్ అమలు, 1991 ఆర్థిక సంస్కరణల ప్రారంభం, అదే ఏడాది రాజీవ్ గాంధీ హత్య వంటి 5 ముఖ్యమైన సంఘటనలను హైలెట్ చేస్తుంది.జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి కొన్ని అంశాలను మార్చారు. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ‘‘ ఈ ప్రాంతం అక్రమ ఆక్రమణలో ఉందని భారత్ పేర్కొంది. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ పాకిస్తాన్ గా అభివర్ణింస్తుంది’’ అయితే దీనిని మారుస్తూ.. ఇది పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న భారత భూభాగం, దీనిని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్((POJK) అని పిలుస్తారని మార్పు చేసింది. డెమెక్రటిక్ రైట్స్ పేరుతో ఉన్న 5వ అధ్యాయంలో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అంశాలను తీసేసింది.
తాజావార్తలు
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!