Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: కన్పూర్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. గంగా నది బ్యారేజీ పరిసరాల్లోని ఓ పొలంలో ‘గార్గ్ ఏవియేషన్’ అనే కాన్పూర్ ఆధారిత శిక్షణ సంస్థకు చెందిన ప్రైవేట్ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన పైలట్లతో పాటు కో-పైలట్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు వారు మరణించినట్లు ప్రకటించారు. మృతులలో పైలట్‌కు 3,000 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది. ఆయన గుజరాత్‌కు చెందినవారు కాగా, కో-పైలట్ కర్ణాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి వివరాలను ఇంకా పూర్తిగా సేకరించాల్సి ఉంది.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి సమాచారం అందించారు. డీజీసీఏ ప్రత్యేక బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించి విచారణ జరపనుంది. పూర్తిస్థాయి పరిశోధన తర్వాతే ప్రమాదం వెనుక ఉన్న సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు. కాన్పూర్ విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన గాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ఈ తీరని లోటును తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!