ప్రయాణాల్లో లగేజీ, విలువైన వస్తువులు మర్చిపోవడం.. కొన్నిసార్లు మారిపోవడం సర్వ సాధారణ విషయమే.. ఎంత జాగ్రత్త పడినా.. ఆ ఇబ్బందులు కొన్నిసార్లు తప్పువు.. ఇక, పోయిన లగేజీ తిరిగి పొందడం కూడా సవాల్‌తో కూడుకున్న విషయమే.. అయితే, మారిపోయిన తన లగేజీ కోసం ఓ ప్రయాణికుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆ ప్రయాణికుడు… తన లగేజీ కోసం సదరు విమానయాన సంస్థను సంప్రదించాడు.. అయితే, అవతలి ప్రయాణికుడి వివరాలు తెలియజేసేందుకు వారు నిరాకరించారు.. దీంతో.. ఏకంగా ఆ విమానయాన సంస్థ వెబ్‌సైట్‌నే హ్యాక్ చేసి వివరాలు తెలుసుకున్నాడు.. అంతే కాదు.. ఇలా అయితే కష్టం.. జర జాగ్రత్తగా ఉండండి అంటూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి.. నెట్టింట మంటపెట్టాడు..
Read Also: TS: గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
ఇండిగో వెబ్‌సైట్‌ను హ్యాక్ వెనుక ఉన్న పూర్తి వివరాల్లోకి వెళ్తే నందన్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ నెల 27న పాట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో వెళ్లాడు.. అదే సమయంలో అతడి బ్యాగ్ మారిపోయింది.. తన బ్యాగ్‌ను పోలినట్లుగా ఉన్న మరో బ్యాగ్‌ను నందన్ కుమార్ తన ఇంటికి పట్టుకెళ్లాడు.. ఇంటికెళ్లిన తర్వాత నందన్ భార్య ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ కస్టమర్ కేర్‌ను నందన్ కుమార్ సంప్రదించాడు. బ్యాగ్‌లు తారుమారైన విషయాన్ని వారి దాష్టికి తీసుకెళ్లిన ఆయన.. తన వద్ద ఉన్న బ్యాగ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబర్ కావాలని కోరాడు. కానీ, రూల్స్‌కు విరుద్ధంగా సదరు వ్యక్తి ఫోన్ నంబర్ ఇవ్వడం కుదరదని ఇండిగో కస్టమర్ కేర్ సిబ్బంది తెలిపారు. ఆయనను కాంట్రాక్ట్ చేసి తిరిగి ఫోన్ చేస్తామని చెప్పారు… కానీ, మళ్లీ ఇండిగో కస్టమర్ కేర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సమస్యను తానే పరిష్కరించుకోవడానికి రంగంలోకి దిగాడు నందన్.. తన వద్ద ఉన్న బ్యాగ్‌పై సంబంధిత ప్రయాణికుడి పీఎన్‌ఆర్ ద్వారా ఇండిగో వెబ్‌సైట్ నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. చెక్ ఇన్, ఎడిట్ బుకింగ్, కాంటాక్ట్ అప్‌డేట్ లాంటివి ప్రయత్నించాడు.. కానీ, ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో.. ఇండిగో వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు ప్రయత్నించాడు. డెవలపర్ కన్‌సోల్ కోసం కంప్యూటర్‌పై ఎఫ్12 ప్రెస్ చేసి.. అందులోని ప్రొగ్రామ్‌ను పరిశీలించిన.. తోటి ప్రయాణికుడి మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని పట్టేశాడు.. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్.. తనకు కాస్త దగ్గరగానే ఉండడంతో ఇద్దరూ ఓ చోట కలిసి బ్యాగ్‌లు కూడా మార్చుకోవడం జరిగిపోయాయి.
ఇంత వరకు బాగానే ఉన్నా.. నందన్ కుమార్ అక్కడితో ఆగలేదు.. ఇండిగో వెబ్‌సైట్‌లోని లోపాలు, కస్టమర్ కేర్ పనితీరుపై సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు.. ఇండిగోకు ట్వీట్ చేసిన నందన్.. తన లగేజీ మారిపోయినప్పట్టి నుంచి జరిగిన విషయాలను వవరిస్తూ.. ఐవీఆర్‌ను, కస్టమర్ సర్వీస్‌ను మరింతగా మెరుగుపర్చాలని సూచించారు.. ఇక, వెబ్‌సైట్ ద్వారా కీలక సమాచారం లీక్ అవుతుందని.. దానిని సరిచేయాలని ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు.. నందన్ ట్వీట్‌పై స్పందించిన ఇండిగో.. అతడికి కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పింది.. అలాగే వెబ్‌సైట్‌లోని భద్రతాపరమైన లోపాలను సరిచేస్తామని పేర్కొంది.. ఏదైనా కాస్త భిన్నంగా కనిపిస్తే.. సోషల్ మీడియాలో రచ్చచేసే నెటిజన్ల కంట ఈ వ్యవహారం పడింది.. షేర్లు, ట్వీట్లతో ఆ వ్యవహారాన్ని పంచుకుంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Soo I traveled from PAT – BLR from indigo 6E-185 yesterday. And my bag got exchanged with another passenger.
— Nandan kumar (@_sirius93_) March 28, 2022
Honest mistake from both our end. As the bags exactly same with some minor differences. 2/n