Bengaluru: బెంగళూర్‌లో ఆటో రైడ్ క్యాన్సిల్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రైడ్ యాప్ ద్వారా ఆటోని బుక్ చేసుకున్న మహిళా ప్రయాణికురాలు రైడ్‌ని క్యాన్సిల్ చేసుకున్నందుకు సదరు ఆటో డ్రైవర్ ఆమెపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రయాణికురాలు తాను ప్రయాణించేందుకు వేరే ఆటోని ఎంచుకున్నందుకు ఆమెపై అరుస్తూ చెంపపై కొట్టడం కనిపిస్తుంది. ‘‘ఆగు, పోలీస్ స్టేషన్ వెళ్దాం’’ అని ఆమె ఫోన్ లాక్కున్నాడు.
నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోలో..‘‘ పొరపాటున మీరు నా రైడ్ ఎలా రద్దు చేస్తారు.. మీ నాన్న గ్యాస్ డబ్బులు ఇస్తారా..? నేను ఇక్కడ ఎంత సేపు ఉన్నారు, మీరు తేలికగా వేరే ఆటోలో కూర్చున్నారు’’ అని ఆటో డ్రైవర్ అనడం వినవచ్చు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ మహిళ చెప్పడంతో ‘‘రండి పోలీసుల వద్దకు వెళ్దాం, నువ్వు నన్ను భయపెట్టగలవని అనుకుంటున్నావా..? అని అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. ఈ సంఘటనను రికార్డ్ చేస్తున్న సమయంలో మహిళ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు.
మిగతా డ్రైవర్లు అతడిని శాంతింపచేసేందుకు ప్రయత్నించినప్పటికీ, రోడ్డుపై పెద్ద గలాటా సృష్టించాడు. ఆటో డ్రైవర్ తన చెంపపై కొట్టాడని ఆమె వీడియోలో పేర్కొంది. ప్లాన్ మారడం వల్ల బుకింగ్ రద్దు చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటోడ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో యూజర్లు డిమాండ్ చేశారు. ‘‘ఇది అర్థంలేని నీచమైన ప్రవర్తన. వేధింపులపై వెంటనే కేసులు నమోదు చేయాలి. ఆటో డ్రైవర్లు అత్యంత నాగరికత లేని వ్యక్తులు.’’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని కర్ణాటక అడిషనల్ డీజీపీ( ట్రాఫిక్ అండ్ సేఫ్టీ) అలోక్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు.
@BlrCityPolice @CPBlr,
Is this acceptable behavior of Auto driver? Harassing female passenger!
It's becoming difficult for women to venture out alone in #Bengaluru
pic.twitter.com/KR669U6P69— Citizens Movement, East Bengaluru (@east_bengaluru) September 5, 2024