Sudipa Chatterjee: “బీఫ్”ని ప్రమోట్ చేసినందుకు నటికి బెదిరింపులు..
- బంగ్లాదేశ్ కుకింగ్ షోకి యాంకరింగ్ చేసిన నటి సుదీప ఛటర్జీ..
- బీఫ్ వంటకం చేస్తున్న వ్యక్తితో సంభాషణ..
- చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయన్న నటి..
- తను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudipa Chatterjee: బంగ్లాదేశ్ కుకింగ్ షోలో పాల్గొన్న బెంగాలీ నటి సుదీపా ఛటర్జీ వివాదంలో ఇరుక్కుంది. షోలో యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఒక పార్టిసిపెంట్ ‘‘బీఫ్’’ వంటకాన్ని తయారు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. బీఫ్ వంటకాన్ని తయారు చేసిన పార్టిసిపేటెంట్తో ఇంటరాక్ట్ కావడంతో కొందరికి నచ్చలేదు. సదరు వ్యక్తితో సుదీప మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి తోడు సుదీపకి అధికార తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రమంత్రి బాబుల్ సుప్రియోతో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా సోషల్ మీడియాలో ఈమెపై విమర్శలు రావడానికి కారణమైంది.
Read Also: Navneet Kaur Rana: అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి లేఖ
Also Read
రాజకీయ ప్రయోజనాల కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని సుదీప క్లారిటీ ఇచ్చింది. ‘‘నన్ను ట్రోల్ చేస్తున్న చాలా మంది వ్యక్తులు ఈ వీడియోను చూడలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేనెప్పుడూ బీఫ్ తినలేదు, వండను కూడా తినలేదు. దానిని ముట్టుకోలేదు. కరీం జహాన్(షోలో పాల్గొన్న వ్యక్తి) వండటం ప్రారంభించలేదు’’ అని ఆమె అన్నారు. ఫేస్బుక్ లైవ్‌లో అక్కడ ఎందుకు నిలుచున్నారని అడిగారని, బంగ్లాదేశ్ జాతీయ గీతం ‘అమర్ సోనార్ బంగ్లా’ వస్తున్నప్పుడు తాను ఎందుకు కదలాలి అని అన్నారు. బంగ్లాదేశ్ జాతీయ వంటకాల్లో బీఫ్ ఒకటని షో నిర్వాహకులు చెప్పారని తెలిపారు. నేను బంగ్లాదేశ్‌లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లానని సుదీప చెప్పుకొచ్చారు. తాను ఒక లౌకికదేశానికి చెందిన వ్యక్తినని, క్రికెట్ మైదానంలో బంగ్లా జాతీయగీతం వచ్చినప్పుడు మన ఆటగాళ్లు కదలకుండా నిలుచుంటున్నారని ఆమె గుర్తు చేశారు.
ఇటీవల షో కారణంగా సీఎం మమతా బెనర్జీ, మంత్రి బాబుల్ సుప్రియోపై విమర్శలు వస్తున్నాయని, అయితే తనకు తృణమూల్ తో కానీ ఇతర ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని ఆమె స్పష్టం చేశారు. నా ఫోటోలు పెట్టి వీరిద్దరిని తిడుతున్నారని చెప్పారు. బీజేపీ పేరుతో తనకు అనేక బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని ఆరోపించారు. తను సజీవ దహనం చేయడంతో పాటు నా తల్లి, కొడుకుని కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..