పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చకచకా పనులు జరిగిపోతున్నాయి. తాజాగా కోల్‌కతా మెట్రో ఆరెంజ్ లైన్‌లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్‌లో గత టీఎంసీ ప్రభుత్వం హయాంలో 15 ఏళ్లు ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 15 రోజుల్లోనే పూర్తి చేసిందని బీజేపీకి చెందిన అమిత్ మాల్వీయా తెలిపారు. 366 మీటర్ల పొడవున్న ఈ అసంపూర్ణ మార్గం కోల్‌కతా దక్షిణ శివారు ప్రాంతాలను సెక్టార్ Vతో కలుపుతుందని అన్నారు. ఆర్‌వీఎన్ఎల్ ఈ పనిని వరుసగా రెండు వారాంతాల్లో పూర్తి చేసిందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పేర్కొన్నారు.
‘‘మమతా బెనర్జీ 15 ఏళ్లలో చేయలేని పనిని సువేందు అధికారి, బీజేపీ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే పూర్తిచేశారు. కోల్‌కతా మెట్రో ఆరెంజ్ లైన్‌లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్ దగ్గర చాలాకాలంగా ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ఆర్‌విఎన్‌ఎల్ (RVNL) నిర్ణీత గడువు కంటే ముందే విజయవంతంగా పూర్తి చేసింది. కోల్‌కతా దక్షిణ శివారు ప్రాంతాలను సెక్టార్ Vలోని ఐటీ హబ్‌తో అనుసంధానించే న్యూ గరియా-ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను పూర్తి చేయడానికి, ఈ 366 మీటర్ల లోపించిన భాగం చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్ సంవత్సరాల తరబడి ఎందుకు నిలిచిపోయింది?, ఎందుకంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ట్రాఫిక్ మళ్లింపునకు పదేపదే అనుమతి నిరాకరించింది. పనిని పూర్తి చేయడానికి ఆర్‌విఎన్‌ఎల్ కేవలం వరుసగా రెండు వారాంతాల పాటు రాత్రిపూట ట్రాఫిక్ దిగ్బంధనాలకు మాత్రమే అనుమతి కోరింది. రాజకీయ అడ్డంకి తొలగిపోయిన వెంటనే పనులు వేగవంతమయ్యాయి. సంవత్సరాలుగా, ఈ ఆలస్యాలకు కారణం “సాంకేతిక కారణాలే” అని బెంగాల్ ప్రజలకు చెబుతూ వచ్చారు. కానీ, అసలు అతిపెద్ద సాంకేతిక సమస్య టీఎంసీ ప్రభుత్వమే అని తేలింది.’’ అని రాసుకొచ్చారు.
What Mamata Banerjee couldn’t do in 15 years, Suvendu Adhikari and the BJP government have delivered in just 15 days.
🚇 RVNL has successfully completed the long-delayed girder launching work at the Chingrighata crossing section of Kolkata Metro’s Orange Line, ahead of schedule.… pic.twitter.com/JWI8IL2wbV
— Amit Malviya (@amitmalviya) May 25, 2026
