బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది.
73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సిద్దం అవుతున్నది. ఈనెల 29 వ తేదీన బీటింగ్ రీట్రీట్‌తో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి. అయితే, ఈసారి బీటింగ్ రీట్రీట్ వేడుకల కోసం ప్రత్యేకంగా డ్రోన్ లు ఆకట్టుకోబోతున్నాయి. సుమారు వెయ్యి డ్రోన్‌లు ఈ వేడుకలలో పాల్గొంటున్నాయి. వీటికి ప్రత్యేకంగా అమర్చిన లేజర్ లైటింగ్ ద్వారా లేజర్ షోను నిర్వహించనున్నారు. దేశంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో డ్రోన్ సహాయంతో ఇలా లేజర్‌షోను నిర్వహిస్తున్నారు.…