Srinagar: పాక్‌లో మసీద్‌పై దాడిని నిరసిస్తూ శ్రీనగర్‌లో నిరసనలు.. భారీ ర్యాలీలు

  • పాక్‌లో మసీద్‌పై దాడిని నిరసిస్తూ శ్రీనగర్‌లో నిరసనలు
  • శ్రీనగర్-బారాముల్లా హైవే‌పై భారీ ర్యాలీలు
Srinagar

Srinagar

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం బాంబ్ దాడులతో దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 170 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్‌ను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.

ఇది కూడా చదవండి: Viral Video: గర్ల్‌ ఫ్రెండ్‌తో పేరెంట్స్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కొడుకు.. తల్లి ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో షియా మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిని నిరసిస్తూ శనివారం భారత్‌లో నిరసనలు వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని హంజీవేరా ప్రాంతంలో షియా వర్గానికి చెందిన కొందరు నిరసనలు వ్యక్తం చేశారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. మహిళలు, పురుషులు ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపైకి వచ్చి షియా స్థానికులు నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్‌పై విమర్శలు.. ఒబామా దంపతుల కోతి బొమ్మల వీడియో తొలగింపు

శుక్రవారం నమాజ్ సమయంలో ఇస్లామాబాద్ షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాద సంస్థ ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పౌరులపై, ప్రార్థనా స్థలాలపై దాడులు అంగీకరించబోమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు.