Assam: అస్సాం పోలీసులు బంగ్లాదేశ్‌తో సంబంధం ఉన్న అతిపెద్ద ఉగ్ర ముఠాను అరెస్ట్ చేశారు. భారత భద్రతా, నిఘా విభాగం ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ టెర్రర్ మాడ్యూల్‌ను అధికారులు భగ్నం చేశారు. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నసీమ్ ఉద్దీన్ అలియాస్ నజీముద్దీన్, అలియాస్ తమీమ్(24), జునాబ్ అలీ (38), అఫ్రాహిమ్ హుస్సేన్ (24), మిజానూర్ రెహమాన్ (46),…