Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..

Bangladesh Mp

Bangladesh Mp

Bangladesh: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు, మమతా బెనర్జీ ఘోరంగా ఓడిపోవడం సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్‌ను భయపెడుతోంది. బీజేపీ గెలిచినప్పటి నుంచి బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీలు, కీలక నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్ ఎంపీ, ఎన్‌సీపీ అధినేత నహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. మమతా బెనర్జీకి మద్దతు తెలిపారు. బంగ్లాదేశ్‌లోని ముస్లింలు ఆమెకు అండగా ఉన్నారని, మమతా ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని నహిద్ ఇస్లాం అన్నారు.

Read Also: Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్‌లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్‌లో మాయమైన వైరస్ శాంపిల్స్!

ఇదే కాకుండా బెంగాల్ ఎన్నికల్లో ముస్లింలు, మథువాలకు ఓటు హక్కు నిరాకరించబడిందని ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, కానీ మా మద్దతు కోల్పోలేదని ఆయన అన్నారు. ఓడిపోయిన రాజీనామా చేయకూడదని, ఢిల్లీతో పోరాడాలని నహిద్ ఇస్లాం అన్నారు. 17 కోట్ల బంగ్లాదేశీ ముస్లింలు ఆమె వెంట ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ మహమ్ద్ నూర్ హుదా డ్యూక్ ఒక సోషల్ మీడియా పోస్టులో.. బీజేపీకి అధికారం అప్పగించకూడదని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక ధైర్యవంతమైన నిర్ణయంగా అభివర్ణించారు. మరికొందరు బంగ్లాదేశ్ నేతలు, పశ్చిమ బెంగాల్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని కూడా పిలుపునిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటి నుంచి ఇలా ఆ దేశ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.