Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్‌లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్‌లో మాయమైన వైరస్ శాంపిల్స్!
- విహార యాత్రలో విషాదం..
- ముగ్గురిని మింగేసిన ప్రాణంతక వైరస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hantavirus Outbreak 2026: సముద్ర ప్రయాణంలో విహరిస్తున్న పర్యాటకులను ఇప్పుడు ‘హంటా వైరస్’ వణికిస్తోంది. ‘ఎంవీ హోండియస్’ అనే క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్‌కు చెందిన భార్యాభర్తలు (ఇద్దరి వయస్సు 69 ఏళ్లు) అర్జెంటీనాలోని ఉషుయా నగరాన్ని సందర్శించినప్పుడు ఈ వైరస్ బారిన పడ్డారు. పక్షుల కోసం వారు ఒక ల్యాండ్‌ఫిల్ సైట్‌కు వెళ్లినప్పుడు, అక్కడ ఎలుకల ద్వారా ఈ వైరస్ వారికి సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఏప్రిల్ 11న జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ భర్త మరణించారు. సెయింట్ హెలెనాలో ఏప్రిల్ 24న నిర్వహించిన భర్త అంత్యక్రియల సమయంలో భార్య కూడా అస్వస్థతకు గురైంది. ఇదే సమయంలో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 26న జోహన్నెస్‌బర్గ్‌లో కన్నుమూసింది. మే 2న అదే నౌకలో ప్రయాణిస్తున్న జర్మనీ పౌరుడు ఒకరు ఈ వైరస్ లక్షణాలతో మరణించారు. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్, మాజీ పోలీస్ అధికారి మార్టిన్ ఆన్‌స్ట్రీ (56) కూడా ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెదర్లాండ్స్‌లోని ఒక ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న ఆయన, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. ఈ వైరస్ చాలా వేగంగా ప్రాణాపాయ స్థితికి చేరుస్తుందని, అయితే ప్రస్తుతం మార్టిన్ ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Also Read
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
- Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
మాయమైన వైరస్ శాంపిల్స్..
మరోవైపు రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని ఒక ల్యాబ్ నుంచి 300 వయల్స్ (vials) మాయమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందులో రెండు వయల్స్‌లో అత్యంత ప్రమాదకరమైన ‘హంటా వైరస్’ ఉంది. ఫ్రీజర్ మార్పిడి సమయంలో ఈ శాంపిల్స్ కనిపించకుండా పోయాయి. అయితే ఇవి దొంగిలించబడలేదని, పొరపాటున ధ్వంసం అయి ఉండవచ్చని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం క్రూయిజ్ షిప్‌లో వ్యాపిస్తున్న వైరస్‌కు, ల్యాబ్‌లో మాయమైన శాంపిల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
హంటా వైరస్ అంటే ఏమిటి..
ఇది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల విసర్జితాలు, లాలాజలం లేదా అవి కరిచినప్పుడు మానవులకు సోకుతుంది. ప్రారంభంలో సాధారణ జ్వరంలా అనిపించినా, తర్వాత కాలంలో ఊపిరితిత్తులు, కిడ్నీల మీద తీవ్ర ప్రభావం చూపి ప్రాణాపాయానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ‘ఎంవీ హోండియస్’ నౌకలో పరిస్థితులను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!