Bihar Voter List: బీహార్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్ల తొలగింపు తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సామాన్య ప్రజల ఓట్లను తొలగించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ ఓటర్ జాబితాను ఈసీ సరిదిద్దుతుంది. ఇక, బీహార్‌లో జరుగుతున్న ప్రత్యేక తీవ్ర పరిశీలనలో భాగంగా ఓటర్ల జాబితాను ఖచ్చితంగా పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు బయటపడ్డాయి. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్.
Read Also: Ravi Mohan : రవిమోహన్ నిర్మాణంలో తొలి సినిమా టైటిల్ ప్రోమో రిలీజ్
విదేశీయుల పేర్లు ఓటర్ల జాబితాలో
ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. ఓటర్ల గుర్తింపు పత్రాల ధృవీకరణలో బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు మయన్మార్, అఫ్గానిస్తాన్‌కు చెందిన వ్యక్తుల పేర్లు కూడా బీహార్ ఓటర్ల జాబితాలో ఉన్నట్లు బయటపడింది. వీరిలో చాలా మంది ఆధార్, రేషన్ కార్డు, డొమిసైల్ సర్టిఫికేట్ లాంటి పత్రాలు కూడా పొందారని అధికారులు వెల్లడించారు.
Read Also: Niharika : బాధ, ఆశ, సంతోషం.. నిహారిక కొణిదెల ఎమోషనల్ జర్నీ
ఆగస్టు 30 వరకు ధృవీకరణ- సెప్టెంబర్ 30న తుది జాబితా
ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల (EROs) ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 30 వరకు సమగ్ర ధృవీకరణ జరుగుతుంది. అర్హత లేని పేర్లు సెప్టెంబర్ 30వ తేదీన విడుదలయ్యే తుది జాబితా నుంచి తొలగించబడతాయని ఈసీ పేర్కొనింది. ఇప్పటికే ఇళ్లకు వెళ్లి జరిగిన పరిశీలనలో అనేక మంది విదేశీయులు గుర్తించబడ్డారు.. వారికి నోటీసులు పంపించామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ప్రతి ఒక్కరు 7 రోజుల్లోపు హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.
Read Also: China Victory Day Parade: బీజింగ్‌లో విక్టరీ డే వేడుకలు.. హాజరుకానున్న పుతిన్, కిమ్ జాంగ్ ఉన్..!
ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలు
ఎన్నికల సంఘానికి గురువారం నాటికి మొత్తం 1,95,802 దరఖాస్తులు వచ్చాయి.. వాటిలో 24,991 దరఖాస్తులు ఇప్పటికే పరిష్కరించబడ్డాయి. అయితే, కొత్తగా వచ్చిన వాటిలో మార్పులు, చేర్పుల గురించి దరఖాస్తులు వచ్చాయో అనేదానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. CPI(ML) 79 పిటిషన్లు, రాష్ట్రీయ్ జనతా దళ్ పార్టీ (RJD) 3 పిటిషన్లు వేయగా.. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు.
Read Also: Urjit Patel: మాజీ ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యత..
99 శాతం పత్రాల ధృవీకరణ పూర్తి..
జూన్ 24 నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు జరిగిన ప్రత్యేక పరిశీలనలో బీహార్‌లోని 7.24 కోట్ల ఓటర్లలో 99.11 శాతం మంది పత్రాలు ధృవీకరించబడ్డాయి. 98.2 శాతం ఓటర్లు తమ డాక్యుమెంట్లు సమర్పించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు, ఆధార్ కార్డు లేదా 11 రకాల అధికారిక పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.