మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు, నిర్మాతలు పలువురు తమ కెరీర్‌ను మెగా వారసత్వంపై నిర్మించారు. ఈ జాబితాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రత్యేకంగా నిలిచారు. చిన్నతనంలోనే హోస్ట్‌గా బుల్లితెరపై పరిచయమైన నిహారిక, తర్వాత ఒక మనసు మూవీతో హీరోయిన్‌గా అడుగు పెట్టారు. హీరోయిన్‌గా మొదటి ప్రయత్నం ఫ్లాప్ అయిన తర్వాత, నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలలో నటించారు. కానీ వీటివల్ల కెరీర్‌లో ఎలాంటి హిట్ పడలేదు..
Also Read :Bigg Boss : ఛాన్స్‌ల కోసం పడుకుంటే తప్పేంటీ.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయినా, నిహారిక తన బలాన్ని గ్రహించి నిర్మాతగా అడుగు పెట్టారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు రూపొందించారు. గతేడాది నిర్మించిన కమిటీ కుర్రాళ్లు మూవీ, తొలి ప్రయత్నంలోనే హిట్ అయ్యి అవార్డులు, రివార్డులు అందుకుంది. ఇక ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక, తన ప్రయాణం, అభిరుచులు, వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటున్నారు. తాజాగా.. ‘నిర్మాణ రంగం నా ఎదుగుదలకు తోడ్పాటు, ఓ ఛానెల్‌లో జడ్జిగా ఉండి, ఆ పక్క బిల్డింగ్‌లోని నా ఆఫీస్‌లో ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్న అనుభవం.. ఇవన్నీ చూసుకుంటే జీవితమంతా కళ్లెదుట గిర్రున తిరుగుతుంది’ అని ఆమె వ్యక్తంగా చేసింది. నిహారిక తెలిపినట్లుగా, తన ప్రయాణం హృదయానికి సంతోషం, బాధ, ఆశ వంటి భావాలను పంచింది. అభిమానులు, సినీ వర్గాలు ఈ ఎమోషనల్ పోస్ట్‌పై స్పందిస్తూ ఆమెకు అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది దైర్యని మెచ్చుకుంటున్నారు.