Mother Cruelty: కసాయి తల్లి.. నాలుగో అంతస్థు నుంచి కూతుర్ని పడేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం మంటగలిసిపోతోంది. నవమాసాలు మోసి, పిల్లల్ని కనే తల్లి వారిని ఎంత కష్టమయినా పెంచి ప్రయోజకుల్ని చేస్తుంది. అలాంటి తల్లి తన కూతుర్ని నాలుగు అంతస్థుల పై నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకి పడేయడం కలకలం రేపుతోంది. బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతుంది తల్లి. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది.
Komatireddy Rajagopalreddy Live: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్
Also Read
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పాపతో కలిసి అపార్ట్ మెంట్ బయట బాల్కనీలో తచ్చాడింది. మళ్ళీ లోపలికి వెళ్ళంది. పాపను రెయిలింగ్ మీద కూర్చోబెట్టింది. కానీ పిల్లను కిందకు తోచేయలేదు.మళ్ళీ ఇంట్లోకి పాపను తీసుకెళ్ళి… బయటకు తెచ్చింది. ఈసారి రెయిలింగ్ నుంచి పాపను అమాంతంగా కిందకు పడేసింది.
పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్ ఎక్కి కాసేపు నిలబడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు పరుగు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. అక్కడికి వచ్చి కింద దృశ్యం చూసి వారంతా షాకయ్యారు. నాలుగో అంతస్తు నుంచి కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర బెంగళూరు ఎస్ఆర్ నగర్‌లోని అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారి మాట్లాడలేదని, చెవులు సైతం వినబడవని తెలిపారు. దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఒక డెంటిస్ట్ కాగా.. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా. ‘తల్లి మానసిక పరిస్థితి సహా మేము అన్ని కోణాల్లో విచారిస్తున్నాము.’ అని పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన కర్నాటకను కుదిపేసింది.
Mehbooba Mufti: ఏదో రోజు బీజేపీ తిరంగా జెండాను మార్చి కాషాయ జెండాను తీసుకువస్తుంది
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!