Baba Ramdev: బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు అసహనం.. కేంద్రానికి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev: అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రచారాలను నిర్వహించవచ్చని, అయితే ఇతర వ్యవస్థలను విమర్శించకూడదని పేర్కొంది. “బాబా రామ్‌దేవ్ అల్లోపతి డాక్టర్లపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చారు. మంచిదే. కానీ ఇతర వ్యవస్థలను విమర్శించకూడదు. ఆయనను అనుసరిస్తే అన్నింటికీ నయం అవుతుందనే గ్యారంటీ ఏమిటి?” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు.
అల్లోపతి మందులు, ఆ విధానంలో వైద్యం చేసే వైద్యులు, కొవిడ్-19 వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఐఎంఏ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కోరుతూ ధర్మాసనం కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
గతేడాది కొవిడ్ రెండో వేవ్ సమయంలో బాబా రాందేవ్ అల్లోపతి వైద్య విధానాలపై చేసిన వ్యాఖ్యల వల్ల దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. “అల్లోపతి మందుల వల్ల లక్షల మంది మరణించారు. వారికి చికిత్స లేదా ఆక్సిజన్ అందక మరణించిన వారి కంటే చాలా ఎక్కువ. అల్లోపతి మూర్ఖమైన, దివాళా తీసిన శాస్త్రం” అని కూడా యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా భారతదేశంలో చాలా మంది వైద్యులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్య విధానాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో రాందేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు, రాందేవ్‌కు వ్యతిరేకంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
Mumbai: హోటల్‌కు బూటకపు బాంబు బెదిరింపు.. రూ.5కోట్లు ఇవ్వకుంటే పేల్చేస్తామంటూ..
మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడేందుకు రామ్‌దేవ్ అల్లోపతి, ఆధునిక వైద్యం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల ప్రతిష్టను దెబ్బతీశారని భారత వైద్య మండలి పేర్కొంది. ఆయుర్వేదంపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బాబా రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు గత వారం కోరింది. కొవిడ్ -19 కోసం పతంజలి కరోనిల్‌ను ఉపయోగించడం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణపై బాబా రామ్‌దేవ్‌పై వివిధ వైద్యుల బృందాలు దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ విచారించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు టీకాలు వేసినప్పటికీ కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని యోగా గురువు చేసిన ప్రకటనపై కోర్టుకు సమాచారం అందింది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!