Ayodhya Rama Mandir : అయోధ్య రామునికి వెండి చీపురును బహుకరిచిన భక్త బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలోని రామ మందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఎంతో కన్నుల పండుగగా విగ్రహ ప్రతిష్ట జరిగింది.. రాముని భక్తులు ఆలయానికి భారీగా విరాళాలను అందిస్తున్నారు.. మొన్న ఓ వజ్రాల వ్యాపారి రామయ్యకు కీరీటాన్ని బహుకరించారు.. ఇప్పుడు రామ భక్తులు ఆయనకు వెండి చీపురును బహుకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అఖిల భారత మోంగ్ సమాజ్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది. ఆల్ ఇండియా మోంగ్ సమాజ్ బాల రాముని గర్భగుడిని శుభ్రం చేయడానికి 1.751 కిలోల బరువున్న వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది. ఈ వెండి చీపురు తయారీకి11 రోజుల సమయం పట్టిందట. చీపురు పైభాగంలో లక్ష్మీ దేవి చిత్రం కూడా చెక్కబడి ఉంటుంది. ఈ వెండి చీపురులో 108 పుల్లలు ఉన్నట్లు చెబుతున్నారు..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ ట్రస్ట్ సభ్యుడు మధుకర్ రావు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తొలి వెండి చీపురును శ్రీరాముడికి అంకితమిచ్చామన్నారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట రోజు అయిన జనవరి 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకున్నారని చెప్పారు… దీపావళి పండుగకు లక్ష్మీ దేవిని పూజిస్తారు.. అలాగే ఈ నెల 22 న కూడా దీపావళి జరుపుకుంటారు.. అందుకే అమ్మవారి గుర్తుగా వెండి చీపురును బహుకరించినట్లు ఆయన తెలిపారు.. ప్రస్తుతం ఈ వెండి చీపురు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
#WATCH | Ayodhya: Devotees of Shri Ram from the ‘Akhil Bharatiya Mang Samaj’ donate a silver broom to the Ram Janambhoomi Teerth Kshetra Trust, with a request that it be used for cleaning the Garbha Griha.
The silver broom weighs 1.751 kg. pic.twitter.com/K9Mgd6HnMZ— ANI (@ANI) January 28, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!