Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర విరాళాల కేసులో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.. అయోధ్య రామమందిర ట్రస్ట్‌కు సంబంధించిన భూ కొనుగోళ్లపై జరుగుతున్న దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆలయానికి వచ్చిన కానుకల దుర్వినియోగ ఆరోపణలతో ప్రారంభమైన విచారణ ఇప్పుడు భూ లావాదేవీల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రెండో దశ విచారణ కోసం అయోధ్యకు చేరుకుని దర్యాప్తును ముమ్మరం చేసింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు SIT పదవీకాలాన్ని పొడిగించగా, ట్రస్ట్‌కు సంబంధించిన నజూల్ భూమి లావాదేవీల్లో పాత్ర ఉన్నట్లు భావిస్తున్న మధ్యవర్తుల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని వారికి ఆదేశాలు జారీ చేయగా, సహకరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తులో భాగంగా ట్రస్ట్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రిజిస్ట్రీ పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పలువురు సాక్షులను పిలిపించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అలాగే అవసరమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని విచారణను కొనసాగిస్తున్నారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే సాక్ష్యాధారాలతో కూడిన ఫిర్యాదును SITకు సమర్పించారు. 2020–21లో భూ కొనుగోళ్లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటైన రాధేశ్యామ్ మిశ్రా కమిటీ నివేదిక ఇప్పటికీ బహిరంగం కాకపోవడంతో, తాజా దర్యాప్తుపై మరింత ఆసక్తి నెలకొంది. విచారణలో భాగంగా ట్రస్ట్‌తో సంబంధం ఉన్న కీలక వ్యక్తుల ఆస్తుల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయోధ్యతో పాటు లక్నో, నోయిడా, ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులపై సమాచారం సేకరిస్తున్నారు. దర్యాప్తులో అవకతవకలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే ట్రస్ట్‌కు చెందిన ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!