Garba Dance: గర్బా ఆడుతుండగా రాళ్లతో దాడి.. ఆకతాయిలను కట్టేసి కొట్టిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garba Dance:దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులను ప్రజలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు నవరాత్రుల సందర్భంగా గర్బా నృత్యం చేస్తున్న మహిళలపై రాళు రువ్వారు. వాళ్లను చెడగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. అక్కడే వారిని పోల్ కు కట్టేసి చితకబాదిన ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైరల్ మారింది.
గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉండెల గ్రామంలోని దేవాలయం ఆవరణలో గర్బా ఆడుతున్న మహిళలపై దాదాపు 150 మంది గుంపు రాళ్లు రువ్వినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. కార్యక్రమాన్ని చెడగొట్టి వారి ఆనందాన్ని దెబ్బతీయాలని ఆకతాయిలు భావించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రాళ్లు రువ్వుతున్న వారిని చెడగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఎవరూ యూనిఫాం ధరించిలేరు. ఒక్క పోలీసు మాత్రం గన్ పెట్టుకుని ఉండడం వీడియోలో కనిపిస్తోంది.
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
Read Also: Encounter: జమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు ఖతం
ఆకతాయిల్లో ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి కరెంట్ పోల్ దగ్గర నిలబెట్టారు. వారి చేతులను ఒక పోలీసు పట్టుకోగా.. మరో పోలీస్ కర్రతో బాదారు. ఆ తర్వాత అక్కడున్న మహిళలకు క్షమాపణలు చెప్పించారు. నిందితులను పోలీసులు కొడుతున్న వీడియోను స్థానికులు వీడియో తీశారు. దీనిని బీజేపీ నాయకులు, ఆ గ్రామస్తులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. అయితే పోలీసులు ఆకతాయిలను కొడుతున్న వీడియో క్లిప్ ఏదీ తనకు కనిపించలేదని అహ్మదాబాద్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వీ చంద్రశేఖర్ చెప్పారు. పోలీసుల చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గర్భా వేదికపై రాళ్లు రువ్విన ఘటనలో మాటర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీఆర్ బాజ్‌పాయ్ తెలిపారు.
Chad Gujarat Police took action on Ms who pelted stones on Hindus in Garba pandals 🔥🔥 pic.twitter.com/DN4SXPBREp
— BALA (@rightarmleftist) October 4, 2022
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!