Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని విడిచిపెట్టి, సూడో సెక్యుటర్ ఎజెండాను అవలంభిస్తోందని బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన ఆరోపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఈ విమర్శలకు ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. బీజేపీ రథయాత్ర చేసినప్పుడు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ శివసేన అని ఉద్దవ్ అన్నారు.
Read Also: H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి
కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న బీజేపీలో అధ్వానీ మాత్రమే కీలక వ్యక్తి అని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు జయలలిత, ఇతర పార్టీల మద్దతును బీజేపీ కోరినప్పుడు, లౌకికవాదం కోసం అద్వానీని వ్యతిరేకించారని ఆ సమయంలో అటల్ బీహారీ వాజ్ పేయి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. కాబట్టి హిందూ మతాన్ని ఎవరు విడిచిపెట్టనట్లు, బీజేపీనా..? శివసేనా..? అని ప్రశ్నించారు.
ప్రస్తుతం మీడియా చేతిలో కలం లేదని కమలం ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాల్లో మూడు పడిపోయాయని, కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. 2022 జూన్ లో మహారాష్ట్ర శివసేనలో తిరుగుబాటు సమయంలో అనర్హత వేటు పడిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణకు వెళ్తున్న సందర్భంలో ఉద్దవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.